Share News

తొలిరోజు పది పరీక్ష ప్రశాంతం

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:29 AM

పదో తరగతి పరీక్ష జిల్లా లో శనివారం మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది.

తొలిరోజు పది పరీక్ష ప్రశాంతం

సిరిసిల్ల టౌన్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పరీక్ష జిల్లా లో శనివారం మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు ఉద యం పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నా రు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నిమిషా లకు విద్యార్థులు మొదటి పరీక్షకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల్లో 7,307 మంది పదో తరగతి విద్యార్తులకు 7,299 మంది విద్యార్థులు హాజరుకాగా, ఎనిమిది మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, గీతనగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఎస్పీ మహేష్‌ బి గితే, డీఎస్పీ నాంగేద్రచారి, సిరి సిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్‌, జిల్లా విధ్యాధికారి బీ జగన్‌మోహన్‌రెడ్డి తనిఖీలు చేశారు. అదే విధంగా విద్యాశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీమైన సంఘటనలు జరగకుండా పరీక్షలు సజావుగా జరగ డం కోసం పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌(144 సెక్షన్‌) అమలు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల వద్ద పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువగా వ్యక్తులు ఉంటే గుమికూడకుండా 100మీటర్ల దూరం వరకు పోలీ సు లు వారిని పంపించేశారు. జిల్లా కేంద్రంలోని జిరాక్స్‌, ఇంటర్‌నెట్‌ సెం టర్లను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరు చుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

గాయపడిన విద్యార్థి పరీక్షకు హాజరు..

ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి వీల్‌చైర్‌లో జిల్లా కేంద్రం లోని గీతానగర్‌ పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాశాడు. సిరిసిల్ల పట్టణా నికి చెందిన విద్యార్థి అమాన్‌ రెహ్మన్‌ 15రోజుల క్రితం ద్విచక్రవాహనం పై నుంచి పడి తీవ్రగాయాలపాలయ్యాడు. అమాన్‌ రెహ్మన్‌కు కుడి చేతి, ఎడమ కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యాడు. పదో తర గతి పరీక్షలు శనివారం ప్రారంభం కావడంతో జిల్లా విద్యాశాఖ నుంచి స్ర్కైబ్‌ అనుమతి తీసుకొని పరీక్ష కేంద్రానికి ఆటోలో తల్లిదండ్రులు, పాఠశాల కరస్పాండెంట్‌ సహకారంతో చేరుకున్నాడు. అమాన్‌ రహ్మన్‌ గది ముందు ప్రత్యేకంగా డెస్క్‌ను కుర్చీని ఏర్పాట్లుచేసి సెంటర్‌ నిర్వా హకులు తొమ్మిదో తరగతి చదువు తున్న మరో విద్యార్థినితో పరీక్ష రాయించారు. అమాన్‌ రెహ్మన్‌ ప్రశ్నలకు జవాబులు చెప్పడంతో ఆ విద్యార్థిని పరీక్ష రాసి సహకరించడంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - Mar 15 , 2026 | 12:29 AM