దొడ్డి కొమురయ్య పోరాట స్పూర్తి ఆదర్శనీయం
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:15 AM
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన పోరాట స్పూర్తి ఆదర్శనీయమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
సుభాష్‌నగర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన పోరాట స్పూర్తి ఆదర్శనీయమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్, ఉన్నతాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీర్ల బీరయ్య, జిల్లా ప్రధానాకార్యదర్శి కర్రె రాజు, జూలపల్లి రఘునందన్, కురుమ సంఘం ట్రస్టు అధ్యక్షుడు చిగుర్ల శ్రీనివాస్, పంచాయతి కమిటీ అధ్యక్షుడు కోరే గట్టయ్య, శవాల అఽక్షయ్ పాల్గొన్నారు.