ప్రజలకు వాస్తవాలను వివరించాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:24 AM
రాజన్న ఆలయానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు లేదా అసంపూర్తి సమాచారాన్ని వెంటనే పరిశీలించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
కోనరావుపేట, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి) : రాజన్న ఆలయానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు లేదా అసంపూర్తి సమాచారాన్ని వెంటనే పరిశీలించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహిం చారు. అనంతరం రైతువేదికలో 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, 89 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ సభ, ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా బాధ్యతలు తీసుకున్న నాయకులు తాము ఇచ్చిన మాట కు కట్టుబడి జన సమీకరణ చేపట్టాలని సూ చించారు. జిల్లాలో ఇప్పటికే సుమారు రూ. 1000కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసా గుతున్నాయన్నారు. తాజాగా మరో సుమారు రూ.250 కోట్లకు సంబంధించిన నిధులు మం జూరయ్యాయని తెలిపారు. సిరిసిల్లకు రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.10 కోట్లతో తెలం గాణ పబ్లిక్ స్కూల్ మంజూరయ్యాయని చెప్పారు. కోనరావుపేటకు కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైనట్లు వివరించారు. ఇవన్నీ ఇప్పటికే కొనసాగుతున్నా రూ.1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు అదనమన్నా రు. వేములవాడ రాజన్న ఆలయానికి రూ. 99.40కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. రానున్నకాలంలో జిల్లాకు మరో రూ.400-500 కోట్ల మేర అదనపు అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృ త్వంలోని ప్రజా ప్ర భుత్వం ప్రజా సంక్షే మం, అభివృద్ధే ల క్ష్యంగా పనిచేస్తోంద న్నారు.డిసెంబర్ 3వ తేదీ నుంచే బీఆర్ ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న ఆల య అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పాత ఆలయ నిర్మాణాన్ని, రాతితో నిర్మించిన మండపాన్ని ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచుతున్నామ ని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, మండల అధ్యక్షుడు మానక సత్యం, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఫిరోజ్‌పాషా, చేపూరి గంగాధర్, భాస్కర్‌రావు, నాలుక సత్యం, రుక్మి ణి, బాల్‌రెడ్డి, అవురం సురేష్, బాలరాజు, ఉప్పుల గంగయ్య, సంజీవ్, సుంకరి రెడ్డి, నా యిని ప్రభాకర్‌రెడ్డి, బుర్ర రమేష్, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.