ఉపాధిహామీ పథకాన్ని రక్షించుకోవాలి
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:59 PM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, పేదలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని రక్షించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కోతిరాంపూర్‌లోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం సమా వేశంలో మాట్లాడారు.
భగత్‌నగర్, జనవరి 14(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, పేదలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని రక్షించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కోతిరాంపూర్‌లోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం సమా వేశంలో మాట్లాడారు. రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 17, 18 తేదీల్లో జిల్లాలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచార జాతాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక, కూలీ చట్టాలపై వివరిస్తామన్నారు. రైతు వ్యతిరేక విత్తన బిల్లు, విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమిస్తామన్నారు.
స్వామి నాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు, సీటు ప్లస్ 50శాతం కనీస మద్దతు ధర వచ్చేలా చట్టం చేయాల్సింది పోయి, కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా విత్తన బిల్లులను కేంద్రం తీసుకొచ్చిందని ఆరోపిం చారు. రైతులకు ఉరితాళ్లు బిగించే విద్యుత్ సంస్కరణ చట్టం తెచ్చిందన్నారు. ఉపాధిహామీ పథ కంలో మహాత్మాగాంఽధీ పేరును తొలగించి వీబీజీ రాంజీ అనే పేరుతో చట్టం చేయడం సరైందికాదన్నారు. ఉపాధి గ్యారంటీ చట్టాన్ని తీసేసి స్పాన్సర్ స్కీము గా తయారు చేశారన్నారు. గ్రామ సభ ద్వారా గతంలో పనుల ఎంపిక జరిగే దని, ఇపుడు ప్రభుత్వమే పనులను ఎంపిక చేస్తుందని అన్నారు. తద్వారా గ్రామీణ సమస్యలు మరింత పేరుకుపోతాయ న్నారు. రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారం మోపుతోందన్నారు. వీబీజీ రామ్ చట్టంలో కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుందని రాష్ట్రంలో 40శాతం భరించా లని, కొత్త చట్టంలో పేర్కొనడం రాష్ట్రాల హక్కులను హరించడమేనని అన్నారు.
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నచోట నిధులు ఇవ్వడం లేదని, ఆ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విత్తన దిగుమతి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అన్ని రకాల పం టలకు గిట్టుబాటు ధరలు లభించేలా చట్టం తీసుకురావాలన్నారు. రైతులకు సరిపడా యూరియాను అందించాలన్నారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈనెల 19న గీభవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం వార్డు సభ్యులుగా గెలిచిన శ్రీకాం త్, రాములను సన్మానించారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం అశోక్, సహాయ కార్యదర్శి జునుతుల జనార్దన్, జిల్లా కమిటి సభ్యులు చెల్పూరి రాములు, రమాదేవి, తిప్పరబోయిన శ్రీకాంత్ పాల్గొన్నారు.
20న నిరుద్యోగ కళాకారుల పోరు దీక్ష
గణేశ్‌నగర్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి):ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కళాకారుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టే పోరు దీక్షను విజయ వంతం చేయాలని జిల్లా ఉద్యమ కళాకా రులు కోరారు. బుధవారం తెలంగాణ చౌక్‌లో పోరుదీక్ష పోస్టర్‌ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండేళ్లవుతోందని, నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకర మన్నారు. ప్రభుత్వం ఇచ్చి న మాట ప్రకారం వెంటనే నిరుద్యో కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కళాకారులు, గాయకులు తదితరులు పాల్గొన్నారు.