ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:45 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన వీబీ జీ రాం జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా జాతీయగ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగుమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన వీబీ జీ రాం జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా జాతీయగ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగుమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల అధ్వర్యంలో నాయకులు తరలివచ్చి ధర్నా చేప ట్టారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మికుల , రైతుల , ఉపాధి కూలీలతోపాటు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడంలో భాగంగా సీఐటీయూ- రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో దశలవారిగా ఆందోళన పోరాటాలకు పిలుపునిచ్చాయన్నారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దుచేసి గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించి, విద్యుత్ సవరణ చట్టం పేరుతో మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి రైతులకు నష్టం చేసే విధానాలను మానుకోవాలన్నారు. గ్రామీణ ప్రజల ఉపాధికి సంబంధించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని విస్త రించి సంవత్సరంలో 200 రోజులు ఉపాధి కల్పించాలని, రోజుకు రూ 600 కూలి అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా బుధవారం మహాత్మా జాతీయ ఉపాధిహామీ చట్టం పేరును మార్పులు చేసి వీబీ జీ రాంజీ పేరుతో ప్రారంభిం చిందన్నారు. దీంతో ఉపాధిహామీ కూలీల ఉపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహ రిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ జాతీ య గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గురజాల శ్రీఽధర్, రామంచ అశోక్ తదిత రులు పాల్గొన్నారు.