Share News

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేయాలి

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:03 AM

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినప్పటి నుంచి ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని, దీనిని ఖచ్చితంగా అమలుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమి షనర్‌ రాణికుముదిని ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేయాలి

సిరిసిల్ల అర్బన్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినప్పటి నుంచి ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని, దీనిని ఖచ్చితంగా అమలుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమి షనర్‌ రాణికుముదిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధర్‌రెడ్డి, సీడీఎంఏ కార్యద ర్శి శ్రీదేవిలతో కలిసి ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ ల్లో ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపా రు. ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లా డుతూ జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 39వార్డులు, వేముల వాడ మున్సిపల్‌ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధ నల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగే ష్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌లు ఖదీర్‌పాషా, సంపత్‌, ఎన్నికల అధికారులు శ్రీనివాసా చారి, ప్రవీణ్‌, అన్సారీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మీర్జా ఫసహత్‌ అలీబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:09 AM