Share News

దసరా సందడి షురూ..

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:34 AM

తెలంగాణ అడపడుచులకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగతో పాటు దసరాను సం బురంగా జరుపుకోవడానికి కొత్త దుస్తుల కొనుగోళ్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా మార్కెట్‌ లో సందడి ఏర్పడింది.

దసరా సందడి షురూ..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

తెలంగాణ అడపడుచులకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగతో పాటు దసరాను సం బురంగా జరుపుకోవడానికి కొత్త దుస్తుల కొనుగోళ్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా మార్కెట్‌ లో సందడి ఏర్పడింది. బతుకమ్మ, దసరా పండుగలతో మళ్లీ పండుగ జోష్‌ కనిపిస్తుం ది. వ్యాపారస్తులు పండుగ సెంటిమెంట్‌లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఆకర్షిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రధా న పట్టణాలుగా ఉన్న సిరిసిల్ల, వేములవా డలో షాపింగ్‌ సందడి జోరుగా కనిపిస్తుంది. రోడ్లపై ఎక్కడ చూసినా జనంతో వ్యాపార కేంద్రాల్లో సందడి నెలకొంది.

కొత్త దుస్తుల కొనుగోలు సంప్రాదాయం

బతుకమ్మ, దసరా అనగానే ఇంటిల్లిపాది కొత్త దుస్తు ల కొనుగోలు చేయడం సంప్రాదాయంగా భావిస్తారు. ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కొత్త బట్టలను కొనుగోలు చేయడం తప్పనిసరిగా భావిస్తారు. కొత్త బట్టలు కట్టుకొని కుటుంబ సభ్యులంతా ఒక చోటకు చేరుకొని దసరా పండుగ రోజు జమ్మి పంచుకుంటారు. బతుకమ్మ పండుగ రోజు తీరొక్క పూలతో పాటు రంగు రంగుల చీరలతో మహిళలు ఆటాపాటలతో గడుపుతా రు. దీంతో చీరల దుకాణాలే కాకుండా రెడీమేడ్‌ దుకా ణాలు, కిడ్స్‌వేర్‌లు కళకళలాడుతున్నాయి. బట్టల దుకా ణాల్లో కొందరూ వ్యాపారస్తులు కొనుగోళ్లపై వెండి నాణె లు, వివిధ వస్తువులు బహుమతులుగా అందిస్తున్నారు.

అన్‌లైన్‌లో కొనుగోళ్ల జోరు...

దసరా సందర్భంగా అన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగింది. ప్రధాన సంస్థలు 80శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించ డంతో జిల్లాలో భారీగా కొనుగోలు చేస్తున్నారు. గృహాల్లో అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లకు పండుగ సంద ర్భంగా ఇష్టపడుతారు. దీనికి అనుగుణంగానే వివిధ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. షోరూంలతో పాటు అన్‌లైన్‌లో టీవీలు, ప్రిడ్జ్‌లు, వాషింగ్‌మిషన్లు, సెల్‌ఫో న్లు కొనుగోళ్లు పెరిగాయి.

పట్టు చీరల సోయగాలు

మహిళలకు హుందాతనాన్ని.. భారతీయ సంస్కృతిని తెచ్చిపెట్టేవి చీరలు. మగువ అందాన్ని మరింత పెంచేవి పట్టు చీరలు. ఈసారి డిజైనర్‌ చీరలు మార్కెట్‌లో మహిళలను ఆకర్షిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా బ్లౌజుల డిజైన్లు కూడా చీరలతో పోటీ పడుతున్నాయి. బతుకమ్మ దసరాల కోసం బట్టల కొనుగోళ్లు మొదల య్యాయి. వ్యాపారులు కూడా అందుకు అనుగుణంగా బట్టల నిల్వలు ఏర్పాటు చేశారు. ఎన్ని చీరలు ఉన్నా పండుగ అనగానే మహిళలు మొదట ఇష్టపడేవి పట్టు చీరలే. ఇందుకు అనుగుణంగా మార్కెట్లో కూడా పట్టు చీరలు అమ్మకాల కోసం వ్యాపారులు పలు రకాల చీరలు తీసుకొచ్చారు. పట్టు చీరల తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటాయి. మార్కెట్లో అసలైన పట్టు వస్త్రాల ఖరీదు భారీగానే కనిపిస్తుంది. రూ.2 వేల నుంచి రూ.లక్షకు పైగా ఉన్నాయి. మార్కెట్లో అసలైన పట్టు వస్త్రాల ఖరీదు కనీసం రూ.5 వేల పైనే మొదలవుతుంది. ధర్మవరం, హిందూపురం, పోచంపల్లి, ఉప్పాడ, మహారాష్ట్ర, పైతాని వీటితో పాటు ఇంకా రకరకాల చీరలు మార్కె ట్లో ఉన్నాయి. మల్బరీలో రీల్‌ మల్బరీ, డుపీయాన్‌, స్పిన్‌, నాయి, మట్కా, త్రోస్టర్‌ తదితర రకాలతో పాటు టస్సర్‌లో రీల్డ్‌ టస్సర్‌, రీచా, కటియ, జరీ వంటివి కూడా పట్టులో వాడిన దారాలను రంగులు కలిపి వస్త్రాలను తయారుచేస్తారు.

Updated Date - Oct 10 , 2026 | 12:34 AM