Share News

డంపింగ్‌ యార్డు రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:04 AM

హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేసే డంపింగ్‌యార్డు ప్రాజెక్టును రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

డంపింగ్‌ యార్డు రద్దు చేయాలి
హుజూరాబాద్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ నాయకులు

హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేసే డంపింగ్‌యార్డు ప్రాజెక్టును రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. డంపింగ్‌యార్డు రద్దయ్యే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో టి రాజు, పి కొండాల్‌రెడ్డి, మహేష్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద డంపింగ్‌యార్డును రద్దు చేయాలని చేపడుతున్న నిరసన దీక్ష బుధవారం 38వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా చిన్నపాపయ్యపల్లి, కొత్తపల్లి గ్రామస్థులు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Apr 30 , 2026 | 12:04 AM