Share News

బకాయిలు విడుదల చేయాలి

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:55 AM

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రం పాత బస్టాండ్‌ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్వీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

బకాయిలు  విడుదల చేయాలి

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రం పాత బస్టాండ్‌ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్వీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ జిల్లా నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ బకాయిలను విడదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శన మని ఆరోపించారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో ఆరెల్లి అనిల్‌కుమార్‌, ముధం అనిల్‌గౌడ్‌, ఎస్‌కే అజ్జు, శేఖర్‌, హరీ ష్‌, ప్రవీన్‌, శశి, పాషా, రాజా పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 12:55 AM