Share News

మహిళా బిల్లుపై ద్వంద్వ వైఖరి వీడాలి

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:26 AM

మహిళా బిల్లుపై విపక్షాలు ధ్వంధ్వ వైఖరితీరు వీడాలని, లేకుంటే మహి ళలు తగిన బుద్ధి చెప్పు తారని భారతీయజనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నా రు.

మహిళా బిల్లుపై ద్వంద్వ వైఖరి వీడాలి

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : మహిళా బిల్లుపై విపక్షాలు ధ్వంధ్వ వైఖరితీరు వీడాలని, లేకుంటే మహి ళలు తగిన బుద్ధి చెప్పు తారని భారతీయజనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నా రు. సిరిసిల్ల పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై కాం గ్రెస్‌, బీఅర్‌ఎస్‌ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత శోచనీయమని మండిపడ్డారు. ఈ బిల్లు పట్ల మహిళలు పండుగ వాతావరణంలో ఉంటే ఆ ఉత్సాహంపై విపక్షాలు నీళ్లు చల్లుతు న్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళ లకు 33 శాతం రిజర్వేషన్‌ కోసం మహిళలు ఎదురుచూస్తున్న తరుణంలో పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింద న్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదని, కేవలం ఇందిరా గాంధీ, సోని యాగాంధీ, ప్రియాంక గాంధీలకే అవకాశాలు రావాలనేది వారి ఆలోచన అని విమర్శించారు. సామాన్య మహిళలు అసెంబ్లీకి, పార్లమెంట్‌కు వెళ్లడం కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ పార్టీలకు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టంలేకనే ఈ బిల్లును పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపిం చారు. అటు సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్య క్షుడు సంగీతం శ్రీనివాస్‌లు ఇద్దరు మహిళా బిల్లు విషయంలో తమ స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్ల మెంట్‌లో ఒక్క ఎంపీ సభ్యుడు కూడా లేని బీ ఆర్‌ఎస్‌ పార్టీ బిల్లును వ్యతిరేకించిన వర్గాల్లో చేరడం సిగ్గుచేటన్నారు. మహిళా రిజర్వేషన్‌లు అమలైతే తమ రాజకీయ అవకాశాలు దెబ్బతిం టాయనే భయంతో ఆయా పార్టీలు బిల్లుకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డకుంలు వచ్చినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ మహిళా బిల్లును విడిచిపెట్టబోదని, 33 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేస్తుం దన్నారు. మహిళా వ్యతిరేక వైఖరి అవలంబి స్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రానున్న రోజుల్లో మహిళలే రాజకీయంగా బొంద పెడు తారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బర్కం వెంకటలక్ష్మీ, కౌన్సిలర్‌లు కొండ వర్షిణి నరేష్‌, మెరుగుల మంజుల శ్రీనివాస్‌, ఊరగొం డ లక్ష్మీరాజు, వేమన పల్లి శోభ, చింతల్‌ఠాణా గ్రామసర్పంచ్‌ గుర్రం అనసూర్య, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, జిల్లా కోశాధికారి రామలింగారెడ్డి, బాగయ్య, వం తడ్పుల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 12:26 AM