తాగునీటి సమస్య పరిష్కరించాలి..
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:06 AM
నగరంలో తాగునీటి సమ్యను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో నగరపాల సంస్థ ఎదుట ఖాళీ బిందెలతో గురువారం ధర్నా నిర్వహించారు.
కరీంనగర్ టౌన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో తాగునీటి సమ్యను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో నగరపాల సంస్థ ఎదుట ఖాళీ బిందెలతో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ లోయర్ మానేరు డ్యామ్‌లో ఉన్న నీటిని పక్క జిల్లాలకు తరలించడంతో కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లానీరు సరిపోక ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన గ్రామాల్లో చెరువులు, కుంటలను కబ్జాలు చేసి రియల్టర్లు ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, మచ్చ రమేశ్, బాకం ఆంజనేయులు పాల్గొన్నారు.