Share News

పేదల సొంతింటి కల సాకారం

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:02 AM

ఇందిరమ్మ ఇంటితో సొంతింతి కల సాకారం అవుతుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

పేదల సొంతింటి కల సాకారం

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇంటితో సొంతింతి కల సాకారం అవుతుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కందికట్కూర్‌లో జక్కుల శ్రీనివాస్‌ నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో బుధవారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు అర్హులైన ప్రతి కుటుంభానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు పొందిన లభ్దిదారులు సకాలంలో నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. సకాలంలో బిల్లులు అందడం వల్లనే పథకానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. తొలత వల్లంపట్ల గ్రామంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌ నేరెళ్ళ విజయ్‌గౌడ్‌, ఏఎమ్‌సీ ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ మ్యాకల శ్రీనివాస్‌, నాయకులు యాస తిరుపతి, రాజశేఖర్‌గౌడ్‌, ఎలుక అనీల్‌, రాజు, ఆళ్ళ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 01:02 AM