Share News

నెరవేరుతున్న పేదల సొంతింటి కల

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:37 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

నెరవేరుతున్న పేదల సొంతింటి కల

మానకొండూర్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని మద్దికుంట, పచ్చునూర్‌ గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ద్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మండలంలో 850 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గృహప్రవేశాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ఎం ఓదెలు, వైస్‌చైర్మన్‌ ఆర్‌ తిరుమల్‌రెడ్డి, సర్పంచ్‌లు బుర్ర శ్రీధర్‌, పార్నంది కిషన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 12:37 AM