Share News

ప్రజా వ్యతిరేకతతోనే కొత్త పింఛన్ల నాటకం

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:16 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతోనే కొత్త పింఛన్ల నాటకం ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు.

ప్రజా వ్యతిరేకతతోనే కొత్త పింఛన్ల నాటకం
ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న కొప్పుల ఈశ్వర్‌

ధర్మారంలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్‌

ధర్మారం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతోనే కొత్త పింఛన్ల నాటకం ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. సోమవారం మండలంలోని వివిద గ్రామాల్లో పర్యటించిన ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 వేల పింఛన్‌ను 4 వేలు చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. పెన్షన్లు పెంచలేకనే కొత్త పింఛన్ల డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు పెన్షన్‌ అమలు చేశారని, ఇప్పుడు వృద్ధులు, బీడి కార్మికుల అప్లికేషన్స్‌ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక కుటుంబంలో పెన్షన్‌దారుడు చనిపోతే, 15 రోజుల్లో అదే కుటుంబంలోని అర్హులకు పెన్షన్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యేదని, ఈ మూడు సంవత్సరాల్లో చనిపోయిన కుటుంబాలకు ఏ ఒక్కరికి పెన్షన్‌ మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన ఏ వర్గానికి న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్దాప్య పెన్షన్‌ను 4 వేలకు, వికలాంగుల పెన్షన్‌ను 6 వేలకు పెంచాలని, వృద్దుల, బీడి కార్మికుల అప్లికేషన్స్‌ స్వీకరించాలని కొప్పుల డిమాండ్‌ చేశారు. నందిమేడారం ప్యాక్స్‌ చైర్మెన్‌ ముత్యాల బలరాంరెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గుర్రం మోహన్‌రెడ్డి, రాసూరి శ్రీధర్‌, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పూస్కూరి రామారావు, తుమ్మల రాంబాబు, ఆవుల శ్రీనివాస్‌, ఎగ్గెల స్వామి, కూరపాటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:16 AM