జిల్లా పదేళ్ల పండుగను ఘనంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:08 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భ వించిన పదేళ్ల పండుగను గ్రామగ్రామాన జరుపుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భ వించిన పదేళ్ల పండుగను గ్రామగ్రామాన జరుపుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా పదేళ్ల పండుగ కార్యక్రమం సందర్భం గా తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా పదేళ్లు గడిచిందన్నారు. పదేళ్ల ప్రయాణం కేవలం కాలగమ నానికి గుర్తు మాత్రమే కాదు ప్రజల ఆకాంక్షలకు అభివృద్ధి ఆశయాలకు అను గుణంగా జిల్లాలో నర్సింగ్, మెడికల్ కళాశాల, అగ్రికల్చర్, జేఎన్టీయూ, బతు కమ్మ ఘాట్, క్రీడా ప్రాంగణాలు కొన్ని వేల కోట్ల నిధులతో నాటి ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రగతికి ప్రతీక అని వ్యవసాయం, చేనేత రంగం విద్య, వైద్యం, రహదారులు, సాగునీరు, సంక్షేమం వంటి రంగాల్లో జిల్లా సాధించిన ప్రగతిని స్మరించుకంటూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రత్యేకతను పండుగగా నిర్వహించుకోవాలన్నారు. గత పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సాధిం చిన విజయాలను స్పూర్తిగా తీసుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరి న్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలని అన్నారు. పదేళ్ల పండుగ వేడుకల్లో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, మహిళలు, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఉత్సవా లను విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం జిల్లా దశాబ్ధి సంబరాల పోస్టర్‌ను ఆవిస్కరించారు. ఈ సమావేశంలో నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, గ్రంథా లయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, తంగళ్ళపల్లి మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.