ధాన్యం కొనుగోళ్లలో జిల్లాను ఆదర్శంగా నిలపాలి
ABN , Publish Date - May 29 , 2026 | 12:02 AM
దాన్యం కొనుగోళ్లలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై ఆయన గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
- పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్
కరీంనగర్, మే 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దాన్యం కొనుగోళ్లలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై ఆయన గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి త్వరగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలని, మిల్లుల్లోనూ వెంటనే ఆనలోడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు డబ్బులు చెల్లింపు విషయంలో ఆలస్యం కాకుండా వెంటవెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని సూచించారు. టార్పాలిన్లు, హమాలీలు, లారీలు తదితర అవసరాల్లో ఎలాంటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తల తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లయిస్ అధికారి నర్సింగారావు, డీఎం రజనీకాంత, సహకార అధికారి రామానుజాచార్యులు పాల్గొన్నారు.