Share News

పది ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలి

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:48 PM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని ఇన్‌ చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.

పది ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని ఇన్‌ చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శనివారం తెలంగాణరాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌(టీఅర్టీఎఫ్‌) క్యాలండర్‌లను ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయులందరు పదో తరగతి విద్యార్థుల సిలబస్‌ను త్వరగా పూర్తిచేయాల న్నారు. మార్చి నెలలో జరిగే పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని, అందుకు ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్‌గౌడ్‌, బోయన్న గారి నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతుగంటి రమేష్‌, కోనరావుపేట మండల అధ్యక్షుడు గాజెంగి విష్ణు, రాష్ట్ర కౌన్సిలర్‌ మామిడాల రమేష్‌, తంగళ్లపల్లి మండ ల అధ్యక్షుడు బూట్ల శ్రీనివాస్‌, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు గుగులోతు రమేష్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి పులిప్రవీణ్‌కుమార్‌, గోలి రాఽధాకిషన్‌, ఇప్ప కాయల ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:48 PM