Share News

బాలల భద్రతలో జిల్లా అగ్రభాగాన నిలవాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:30 PM

బాలల భద్రత, రక్షణ, సంక్షేమంలో జిల్లా అగ్రభాగాన ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

బాలల భద్రతలో జిల్లా అగ్రభాగాన నిలవాలి
: మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాలల భద్రత, రక్షణ, సంక్షేమంలో జిల్లా అగ్రభాగాన ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. శనివారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో బాలల భద్రత, రక్షణ, సంక్షేమ వారంపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సఖి స్వధార్‌ ఛైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ సిబ్బందితో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అన్ని పథకాలు, కార్యక్రమాలపై గ్రామగ్రామాన విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, డీపీవో జగదీశ్వర్‌, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ కో ఆర్డినేటర్‌ సంపత్‌యాదవ్‌, సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లక్ష్మి పాల్గొన్నారు.

ఫ ఐడీఓసీని ప్రారంభానికి సిద్ధం చేయాలి

ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్స్‌ కాంప్లెక్స్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. శనివారం ఐడీఓసీ పనుల పురోగతిపై తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్‌ రెండులోగా కాంప్లెక్స్‌ను ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేయాలని అఽధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ డి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రామ్‌, ఈఈ నరసింహాచారి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:30 PM