జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:24 AM
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రభాగాన ఉంచేందుకు ప్రతి ఒక్క రు కృషిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎంజేలా ఆల్ర్ఫెడ్ అన్నారు.
వేములవాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రభాగాన ఉంచేందుకు ప్రతి ఒక్క రు కృషిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎంజేలా ఆల్ర్ఫెడ్ అన్నారు. వేము లవాడ పట్టణంలోని బస్తీ దవాఖానాను, ఏరియా ఆసుపత్రిలోని పాలియే టివ్ కేర్, ఆయూష్ మన ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తని ఖీచేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అనం తరం ఆమె మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులు బీపీ, షుగర్‌లకు సంబంధించి మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అసంక్ర మిత వ్యాధుల నివారణలో భాగంగా 30సంవత్సరాలు పైబడిన వారందరి ని రక్తపోటు, డయబెటిస్ వ్యాదుల పైన స్ర్కీనింగ్ చేసి గుర్తించిన వారికి చికిత్స అందించాలని తెలిపారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి, జిల్లా జనరల్ హాస్పిటల్‌లోని సైకియాట్రిస్ట్ డాక్టర్ వద్దకు రిఫర్ చేయాలని సూచించారు. ఆమె వెంట ఎన్సీడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, వైద్యులు తదితరులు ఉన్నారు.