Share News

సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:34 AM

సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ ను పునరుద్ధరించాలని కరీంనగర్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి, కన్వినర్‌ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి
కలెక్టరేట్‌ ఆవరణలో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ ను పునరుద్ధరించాలని కరీంనగర్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి, కన్వినర్‌ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ విద్రోహదినంగా పాటిస్తూ భోజన విరామ సమయంలో ఉద్యోగులు మంగళవారర నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు స్థితప్రజ్ఞ, సంగెం లక్ష్మణరావు, ఎడ్ల అరవింద్‌రెడ్డి, కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య, మోసం అంజయ్య, ఆలి మహేందర్‌రెడ్డి, ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాగి శ్రీనివాస్‌, సర్ధార్‌ హర్మిందర్‌సింగ్‌, మారుపాక రాజేష్‌, భరద్వాజ్‌, సుమంత్‌రావు, రామస్వామి, శంకర్‌, శారద, సునీత, సరిత, హరిప్రియ పాల్గొన్నారు.

ఫ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఐక్య పోరాటం

ఉద్యోగుల డిమాండ్ల సాధన ఐక్య పోరాటాలతోనే సాధ్యమని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం పెన్షన్‌ విద్రోహ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు కలెక్టరేట్‌ ఠఛీజ్డీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేసి ఉద్యోగులకు భద్రమైన పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డిఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ల కేంద్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండి రాజేశ్వరి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల కిషన్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు ఎం సమ్మయ్య, ఉపాధ్యక్షుడు కె రాములు, కెప్రసాద్‌, కె రాజ్‌కుమార్‌, నెల్లి సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:34 AM