Share News

ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:54 PM

ఇందిరా మహిళా శక్తి భవన నిర్మా ణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

సిరిసిల్ల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఇందిరా మహిళా శక్తి భవన నిర్మా ణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.5కోట్లతో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మి స్తున్న ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ముం దుగా భవన నిర్మాణ ప్లాన్లు, భవన నిర్మాణ పనులు, గదులు పరిశీలించి.. ఎప్పటిలోగా పూర్తి అవుతాయో ఆరాతీశారు. పనుల పురోగతిని నిత్యం పరి శీలించాలని ఆదేశించారు. భవన నిర్మాణ పనుల కోసం కార్మికుల సంఖ్యను పెంచి మార్చి 8వ తేదీలోగా పూర్తిచేసి మహిళా దినోత్సవంలోగా అందుబా టులోకి తీసుకురావాలని ఈఈ పీఆర్‌ని ఆదేశించారు. జిల్లా మహిళా స మాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో గీత, ఈఈ పీఆర్‌ సుదర్శన్‌రెడ్డి, తహ సీల్దార్‌ మహేష్‌ కుమార్‌, ఏఈ సతీష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:54 PM