బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టాలి
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:39 AM
కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి పనుల ను, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ, బీఆర్ ఎస్ చేస్తున్న కుట్రలను ఎప్పటి కప్పుడు తిప్పికొట్టాలని వేముల వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కార్యకర్తలకు సూచించారు.
వేములవాడ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి పనుల ను, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ, బీఆర్ ఎస్ చేస్తున్న కుట్రలను ఎప్పటి కప్పుడు తిప్పికొట్టాలని వేముల వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్‌లో ఆదివా రం ఇందిరమ్మ ఇంటి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమా నికి పాటుపడుతుందని అన్నారు. ఫస్ట్‌హాఫ్‌లో ఫెయిల్ అయ్యింది ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ అని ఆరోపించారు. కావాలని కేటీఆర్ ప్రభుత్వంపై బుర ద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, పది సంవత్సరా లలో కేసీఆర్ ప్రభుత్వ విఫలమైందని విమర్శించా రు. అందుచేతనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో ఇప్పటికే బుద్ధి చెప్పారని, సీఎం రేంవంత్‌రెడ్డి పాలనకు స్థానిక సంస్థల్లో పట్టం కట్టారని గుర్తు చేశారు. దేశంలో తెలంగాణ సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని, నేడు దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్క రికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఇల్లు లేని నిరుపే దలకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇందిరమ్మ ఇళ్లు అందజేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూమ్ మధు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కనికరపు రాకే ష్ నాయకులు సాగరం వెంకటస్వామి, కట్కూరి శ్రీనివాస్, కూరగాయల కొమురయ్య, చిలుక రమే ష్, పులి రాంబాబు, పాత సత్యలక్ష్మి, బొజ్జ భారతి తదితరులు ఉన్నారు.