వేములవాడ మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:18 AM
వేములవాడ మున్సిపల్‌పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): వేములవాడ మున్సిపల్‌పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేము లవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్‌లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాను న్న మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. మున్సిపల్ పరిధిలోని 28వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్‌కు ఓటు వేసేలా కార్యకర్తలు ప్రతి ఇం టికి తిరగాలని తెలియజేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజన్న ఆలయానికి సంవత్సరానికి రూ.100కోట్లు కేటాయిస్తామని చెప్పి పట్టణ ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.150 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తు న్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని అభివృద్ధి పథంలో నిలిపే బాధ్యత తీసుకుంటానన్నారు. పట్టణంలో సుమారు 2 వేల మంది స్థలంలేని పేదలు ఉన్నారని, వారందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీచ్చారు. రూ.10కోట్లతో మురుగు నీరు గుడి చెరువులో, మూలవాగులో కలవకుం డా ప్రత్యేక ప్రణాళికు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. వేమలవాడను పర్యాట క రంగంలో అభివృద్ధి చేస్తున్నామని, అందులు భాగంగా గుడి చెరువులో రూ.1.40 కోట్లతో బోటింగ్‌కు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు గూడురు మధు, కొక్కుల రాజు, పుల్కం రాజు, సిర్రం పర్శరాములు యాదవ్, చిలుక రమేష్, కూరగాయాల కొమురయ్య, ఇప్పపూల అజయ్, పాత సత్యలక్ష్మి, తోట లహరి, బొజ్జ భారతి, కాశ శ్రీనివాస్, నీలం గురువయ్య, దండగుల తిరుపతి, చిలువేరి శ్రీనివాస్, రాగిరి నాగరాజు తదితరులు ఉన్నారు.