Share News

రంగు పడింది..

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:07 AM

ఆనందాల కేరింతలు, యువకుల నృత్యాలు, చిన్నారుల చిద్విలాసాల మధ్య రంగుల హరివిల్లుగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హోలీ సంబురాలు జరుపుకున్నారు. జిల్లాలో ఉదయం నుంచే గ్రామాల నుంచి పట్టణాల వరకు హోలీ సందడి కనిపించింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కౌన్సిల్‌, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అన్ని వర్గాల ప్రజలు వేడుకల్లో భాగస్వాములయ్యారు.

రంగు పడింది..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఆనందాల కేరింతలు, యువకుల నృత్యాలు, చిన్నారుల చిద్విలాసాల మధ్య రంగుల హరివిల్లుగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హోలీ సంబురాలు జరుపుకున్నారు. జిల్లాలో ఉదయం నుంచే గ్రామాల నుంచి పట్టణాల వరకు హోలీ సందడి కనిపించింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కౌన్సిల్‌, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అన్ని వర్గాల ప్రజలు వేడుకల్లో భాగస్వాములయ్యారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వివిధ వాడల్లో డీజే సౌండ్ల మధ్య నృత్యాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువకులు బైక్‌లపై తిరుగుతూ రంగులు చల్లుకోవడంతో సందడి వాతావరణం ఏర్పడింది. హోలీ సందర్భంగా ఎస్పీ మహేష్‌ బీ గీతే, డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. అధికారులు, సిబ్బందిలో కలిసి ఎస్పీ మహేష్‌ బీ గీతే నృత్యలు చేసి ఉత్సాహాన్ని నింపారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. కామదహనం, ఉట్టి కొట్టడం వచ్చి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, కొత్త ఉత్సాహం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పోలీసు కుటుంబంలో స్నేహభావం, ఐక్యత మరింత బలపడేలా వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో కౌన్సిల్‌ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు హోలీ సంబురాలు జరిపారు.

Updated Date - Mar 04 , 2026 | 01:07 AM