Share News

సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలి

ABN , Publish Date - May 28 , 2026 | 11:49 PM

రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, సం బంధిత ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు ధాన్యం తరలించేందుకు సరిపడా వాహనాలు సమకూ ర్చాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలి

వేములవాడ రూరల్‌, బోయినిపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, సం బంధిత ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు ధాన్యం తరలించేందుకు సరిపడా వాహనాలు సమకూ ర్చాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. వేములవాడ రూరల్‌ మండలం వట్టెంల, ఫాజుల్‌ నగర్‌, బోయినిపల్లి మండల కేంద్రం, కోరెం, బూరుగుపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం తనిఖీచేసి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల కు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి ఆన్‌లైన్‌ ట్యాబ్‌ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తిచేయాలన్నారు. కొనుగోలు కేం ద్రాల్లో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని త్వరగా తూకం వేసి తరలించాలని, రైతులకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యం విషయంలో రైతులు అధైర్యపడకుండా ధాన్యం సేకరిస్తామని భరోసా కల్పించాలని సూచించారు. రైతులు ఆందోళన చెందకుండా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. తూకం వేసిన ధాన్యం లోడింగ్‌ చేయడం కోసం హమాలీల సంఖ్య పెంచు కుని కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

Updated Date - May 28 , 2026 | 11:49 PM