రాజన్నపై దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసిన సీఎం
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:24 AM
రాజన్న ఆలయానికి వస్తే పదవులు ఊడిపోతాయనే దుష్ప్రచా రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పటాపంచలు చేశారని పంచా యతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, గ్రామీణ నీటి పారు దల, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నా రు.
వేములవాడ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాజన్న ఆలయానికి వస్తే పదవులు ఊడిపోతాయనే దుష్ప్రచా రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పటాపంచలు చేశారని పంచా యతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, గ్రామీణ నీటి పారు దల, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నా రు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాం డు ఎదురుగా జంక్షన్ సుందరీకరణ పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీతక్క మాట్లా డుతూ పేద ప్రజల దేవుళ్లు మేడారం సమ్మక్క, సరాక్క, వేములవాడ రాజన్న ఆలయాలను ఏకకాలంలో సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని, ప్రజల గుండెల్లో సీఎం రేవంత్‌రెడ్డి కలకాలం నిలిచిపోతారని అన్నారు. సమ్మక్క, సారక్క జాతరకు ముందు వేములవాడ రాజ న్నను దర్శించుకోవడం తాత, ముత్తాతల నుంచి వస్తు న్న ఆనవాయితీ అని చెప్పారు. తాత,ముత్తాతల విశ్వా సాలను గౌరవించి, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు. ఒకప్పుడు పేద ప్రజలు కాలినడకన సమ్మక్క, సారక్క, వేముల వాడ రాజన్నను దర్శించుకునే వారు అని గుర్తు చేశారు. అట్టడుగు ప్రజలకు గౌరవాన్ని ఇస్తూ దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నా డని సూచించారు. సమ్మక్క, సారక్క ఆలయ అభివృ ద్ధిలో అడుగడుగునా తమ సంస్కృతి, సంప్రదాయాలు, పూర్వ వైభవం కళ్లకు కట్టేలా శిలాలపై చెక్కిస్తున్నామని అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ చరిత్రను, పూర్వపు వైభవనాన్ని చిత్రికరించి పాత ఆన వాళ్లను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కోరారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం మహా ఘట్టానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని, రెండు రోజుల్లో క్యాబినేట్ మీటింగ్ మేడారంలో జరగనుందని, మంత్రులు అందరు సమ్మక్క, సారక్క సన్నిధికి తరలిరా నున్నారని చెప్పారు. రాజన్న ఆలయాభివృద్ధి చెందిన వెంటనే వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి క్యాబినేట్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి కృషి చేస్తానని తెలిపారు. కూడ ళ్ల సుందరీకరణ ఆధ్యాత్మికతను పెంచేలా ఉంటుందని, దక్షిణకాశీగా ప్రసిద్ది చెందిన వేములవాడ ప్రధాన కూడ లిని నందిపై శూలంతో వస్తున్న శివుడి ప్రతిమతో జంక్ష న్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదం కలిగేలా జంక్షన్‌లు దోహదపడుతాయని తెలిపారు.
టెంపుల్ సిటీగా అభివృద్ధే లక్ష్యం..
దక్షిణకాశీగా ప్రసిద్ది చెందిన రాజన్న ఆలయం, వేము లవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేయడమే ఎకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్ జంక్షన్ సుందరీ కరణ పనుల్లో భాగంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 యేళ్లుగా పట్టణ ప్రజలు, రా జన్న భక్తులు ఎదురుచూస్తు న్న రోడ్డు విస్తరణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యం లో మోక్షం లభించిందన్నా రు. రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ది, రూ.1.40 కోట్లతో గుడి చెరువులో బోటింగ్, రూ.47కోట్లతో 80ఫీట్ల రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం తోపాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేంతుకు ప్రణా ళికాబద్ధంగా సాగుతున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం పేదల ప్రభుత్వమని, సీఎం రేవంత్‌రెడ్డి వేముల వాడ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని, మరిన్ని నిధులు రాజన్న ఆలయానికి రానున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకువచ్చారని రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పట్టణాన్ని మరింత అభివృద్ది చేసేం దుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, సంద్రగిరి శ్రీనివాస్, అక్కనపల్లి నరేష్, సాగరం వెంకటస్వామి, నాగుల విష్ణు ప్రసాద్ తదితరులు ఉన్నారు.