Share News

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:20 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్వీ నాయకుడు కంచర్ల రవి గౌడ్‌ అన్నారు.

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలి

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్వీ నాయకుడు కంచర్ల రవి గౌడ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజులక్రితం ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఉద్ధేశించి క్రిమినల్స్‌ వేస్ట్‌ అంటూ అవమానకరంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి భవిష్యత్తు తరాలైన విద్యార్థులను అవమానించడం దు ర్మార్గమన్నారు.విద్యార్థుల పట్ల అవమానకరంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమా వేశంలో నాయకులు మట్టె శ్రీనివాస్‌, ఆరెల్లి వినయ్‌, బక్కని వేణుయాద వ్‌, మల్యాల ప్రవీన్‌, శశి, ప్రశాంత్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:20 AM