Share News

మార్మోగిన మార్కండేయ నామస్మరణ

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:26 AM

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శివభక్త మార్కండేయ స్వామి నామస్మరణతో శుక్రవారం కన్నుల పండువగా మార్కండేయ స్వామి శోభాయాత్ర జరి గింది.

మార్మోగిన మార్కండేయ నామస్మరణ

సిరిసిల్ల ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శివభక్త మార్కండేయ స్వామి నామస్మరణతో శుక్రవారం కన్నుల పండువగా మార్కండేయ స్వామి శోభాయాత్ర జరి గింది. మార్కండేయ స్వామి దేవాలయం నుంచి బయలు దేరిన రథయాత్ర... మగ్గం ప్రదర్శనతో సాగింది. శోభాయా త్రకు వందలాది మంది పద్మశాలీలు తరలివచ్చారు. సిరిసి ల్ల పద్మశాలీ సంఘం, యువజన,మహిళ పంఘం ఆధ్వర్యం లో నూలు పౌర్ణమి సందర్భంగా మార్కండేయ దేవస్థానం నుంచి ప్రత్యేక అలంకరణలతో ముందు రథం, వెనుక ట్రాక్ట ర్‌పైన మగ్గం నేస్తున్న కార్మికుడి ప్రదర్శన నిర్వహించారు. గాంధీ, అంబేద్కర్‌, నేతన్న విగ్రహాలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్‌ , ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి పద్మశాలి ప్రతినిధులు మగ్గంపైన నేసిన కండువాలతోపాటు పూలమాలలు వేశారు. పద్మశాలి మహి ళా ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌, విప్‌ ఆది శ్రీని వాస్‌కు రాఖీ కట్టారు. ఉదయమే మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞోపవీత ధారణతో పాటు పూజలు, హోమం నిర్వహించారు.

చేనేత వర్గాలుంటేనే సిరిసిల్ల బాగుంటుంది

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

చేనేత వర్గాలు ఉంటేనే సిరిసిల్ల బాగుంటుందని, ఇందు కోసం చేనేత రంగం, నేతన్నల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని, వారి వృత్తికి అండగా ఉంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్ర వారం రాత్రి సిరిసిల్లలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరి గిన రక్షాబంధన్‌ వేడుకలు, నూలు పౌర్ణమి సందర్భంగా మార్కండేయస్వామి శోభాయాత్ర,మగ్గం ప్రదర్శన నిర్వహిం చారు. శోభాయాత్రలో పాల్గొని సిరిసిల్ల నేతన్న విగ్రహానికి పూలమాల వేసి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ చేనేత వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవడం, సమాజంలో గౌరవంగా బతకడానికి దుస్తులు నేస్తున్న చేనేత వృత్తి బతకాలన్నా, వృత్తికి కారణమైన ముడిసరుకు అందించే రైతులు బతకాలన్నా ఖాదీ దుస్తులను విధిగా ధరించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ శాఖతో పాటు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా కూడా పాలిస్టర్‌ శాలువాలు కాకుండా ఖాదీ కండువాలు వాడే విధం గా చెప్పిందన్నారు. రాజకీయ పార్టీలు కూడా పాలిస్టర్‌ శాలువాలను నిషేధించి ఖాదీ కండువాలను ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వం చేనేత వృత్తిని కాపాడడానికి, నేతన్నల సంక్షేమం కోసం కృషి చేస్తుంద న్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ నేతన్నలు ఎదగడా నికి ప్రభుత్వం చేయూతనిస్తుందని, చేనేత వర్గాలకు రుణమాఫీ చేసిం దని అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, కోటి చీరలు మహిళలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గూడం శంకర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆడెపు చంద్ర కళ, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూరదేవరాజు, పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్‌, చేనేత వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌, టౌన్‌క్లబ్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, టెక్స్‌టైల్‌ పార్క్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ అనిల్‌, పద్మశాలి మహిళా అధ్యక్షురాలు వనిత, యువజన సంఘం అధ్యక్షుడు హరీష్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌, మాజీ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం ప్రతినిధులు బొల్లి రామ్మోహన్‌, పూర్లచందర్‌, గాజుల బాలయ్య, మండల సత్యం, మోర రవి,గౌడ రాజు, యెల్లే లక్ష్మీనారాయణ, మ్యాన రవి, దార్నం అరుణ, తార మున్సిపల్‌ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:26 AM