Share News

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణం

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:27 AM

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణమని సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, యూరియా ఇవ్వకుండా మోసం చేస్తోందని బండి సంజయ్‌ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణం
మీడియాతో మాట్లాడుతున్న సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌ అర్బన, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణమని సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, యూరియా ఇవ్వకుండా మోసం చేస్తోందని బండి సంజయ్‌ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. రాషా్ట్రనికి కేంద్రం నుంచి రావాల్సిన యూరియా వాటాను సకాలంలో అందించకుండా బీజేపీ సర్కార్‌ మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రం వాటా నిలిపేసి బదనాం మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి రైతులు ఓట్లు వేయలేదా అని నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. యూరియాపై బండి సంజయ్‌ కేంద్ర ప్రభు త్వాన్ని నిలదీయాలని, రాషా్ట్రనికి వచ్చే వాటా విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలని కోరారు. రైతాంగం దగ్గర రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలనే బదనాం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇదే సమయంలో ఓటర్లను ప్రలోభా లకు గురి చేస్తున్నారని, ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చి కొంటు న్నారని గంగుల కమలాకర్‌ చేసిన ఆరోపణ పైనా సుడా చైర్మన స్పందిం చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, విచ్చల విడిగా బీఆర్‌ఎస్‌ హయాం లోనే డబ్బుల పంపిణీ జరిగిందని ఆరోపి ంచారు. ఓటర్లను గంగుల కమలాకర్‌ అవమానిస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు మధ్య పాలనను ప్రజలు తెలుసుకున్నారని సుడా చైర్మన అన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:28 AM