కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:11 AM
కేంద్రంలోని ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కన్నుసన్నల్లో పరిపాలన కొనసాగిస్తున్నదని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.
భగత్‌నగర్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కన్నుసన్నల్లో పరిపాలన కొనసాగిస్తున్నదని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నగరంలోని పద్మనగర్‌లో సీపీఐ ప్రచార జాతను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో సామాజిక న్యాయం లేదని, పేద ప్రజల బతుకులకు భద్రత కరువైందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార జాతను నిర్వహిస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరల భారాన్ని ప్రజలపై వేస్తుందన్నారు. సెప్టెంబరు 1 ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నామని, కార్యక్రమాన్ని సీపీఐ శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, లక్ష్మారెడ్డి పైడిపల్లి రాజు, మచ్చ రమేష్, బామండ్లపల్లి యుగంధర్ పాల్గొన్నారు.