కేంద్ర ప్రభుత్వం షరతులు లేకుండా
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:46 PM
సహారా ఇండియా గ్రూప్ కంపెనీ లో డబ్బులు డిపాజిట్ చేసిన తమకు కేంద్ర ప్రభుత్వం షరుతులు లేకుండా వడ్డీతో పాటు మొత్తం చెలించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
సిరిసిల్ల టౌన్ మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : సహారా ఇండియా గ్రూప్ కంపెనీ లో డబ్బులు డిపాజిట్ చేసిన తమకు కేంద్ర ప్రభుత్వం షరుతులు లేకుండా వడ్డీతో పాటు మొత్తం చెలించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సీపీఐ ఆధ్వర్యంలో సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులు, ఏజెంట్లు పట్టణ ప్రధాన రహదారుల గుండా ఆర్డీవో కార్యాలయం వరకు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం లోని సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్య దర్శి మూషం రమేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమేష్ మాట్లాడారు. సహారా ఇండియా గ్రూప్ కంపనీలో అవసరాలకు ఉపయోగపడతాయని అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో కోట్లాది మంది పేద ప్రజలు డబ్బులు వివిధ పద్ధతుల్లో పొదుపు చేసుకున్నారన్నారు. 2023 నవంబర్‌లో సహారా గ్రూప్ కంపనీ అధినేత సుబ్రతారాయ్ మరణించిన తర్వాత కంపెనీ మూతపడడంతో గడువు ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించ లేదన్నారు. దీంతో బాధితులు కోర్టులో కేసు వేయగా సుప్రీం కోర్టు 2023 మార్చి 29న కంపెనీని కేంద్ర ప్రభు త్వం స్వాధీనం చేసుకొని ఆస్తులను జప్తు చేసి ఒక సంస్థ ద్వారా డబ్బులు జమ చేసిన బాధితులందరికి సంవత్సరంలోపు చెల్లించాలని ఆదేశించిందన్నారు. బాధి తులు సహారా ఇండియా గ్రూప్ కంపెనీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జవ్వాజి విమల, ఆడెపు రజిత, సందు పట్ల పోచమల్లు, గోవర్ధన్, సహారా ఇండి యా గ్రూప్ కంపెనీ బాధితులు పాల్గొన్నారు.