కేంద్రం అనుచిత విధానాలపై ఉద్యమించాలి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:07 AM
కేంద్ర ప్రభుత్వ అనుచిత విధానాలపై ఉద్య మించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు.
తిమ్మాపూర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ అనుచిత విధానాలపై ఉద్య మించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల అరుంధతి ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ముఖ్యకార్యర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు పని కల్పించేందుకు ఉద్ధేశించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును తొలగించించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ కార్యికులను చైతన్యవంతులను చేయాలన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనిప్రదేశాలలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలన్నారు. కేంద్రం విధానాలను ఎండగడుతూనే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. త్వరలోనే యువజన కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల్లో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు చోటు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకర్గ అధ్యక్షులు అట్ల అనిల్, నాయకులు తుర్తి అరవింద్, సురేష్, మణికంఠ, సతీష్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.