విద్యారంగానికి కేంద్రం పెద్దపీట
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:03 AM
విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ దేశంలో 12 ఏళ్లుగా అదర్శ పాలన మచ్చలేని పాల న కొనసాగుతుందన్నారు. నరేంద్రమోదీ ప్రధానిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశాన్ని 18వ స్థానంలో నిలి పారన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మోదీ విజన్ 3వ స్థా నానికి చేరిందన్నారు. 2047కల్లా ప్రపంచంలోనే మన దేశాన్ని ఆర్థికంగా మొదటి స్థానంలోకి తీసుకురావాలని సంకల్పించార న్నారు. దేశ ఆర్థిక ప్రగతి, సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకా లను అమలు చేస్తున్నారన్నారు. విద్యా, వ్యవసాయం సెక్టార్‌లో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎన్‌ఈపీ 2020 నూతన ఎడ్యూకేషన్ పాలసీతో విద్యావవస్థలో కొత్త సంస్కరణలు తీసుకవచ్చారన్నారు. ప్రాక్టికల్‌గా వృత్తివిద్యా కోర్సులను తీసుకవచ్చార న్నారు. అలాగే ఇన్నోవేషన్ రంగంలో ప్రావీణం ఉన్న యువత, మహి ళలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. హైవేస్, రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయాలను అధునాతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. కేంద్ర నిధులతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి సెక్టా ర్‌లోను కేంద్ర నిధులు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జీ గంగాడి మోహన్‌రెడ్డి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్ , గరిపెల్లి ప్రభాకర్ రాష్ట్ర దళిత మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులుశీలం రాజు, బర్కం లక్ష్మి, కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, ఆఫీస్ ఇంచార్జ్ భాగయ్య, కార్యదర్శి దుర్గారెడ్డి, సెన్సార్ బోర్డు మెంబర్ వైశాలి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సిరిసిల్ల పట్టణంలో ని పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల కోసం తయా రుచేస్తున్న మధ్యాహ్నభోజనంతో పాటు మరుగుదోడ్లను పరిశీలించారు. శివనగర్‌లోని కుసుమ రామయ్య జిల్లా ఉన్నత పాఠశాలను సందర్శిం చి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. సాయినగర్ ప్రభుత్వం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌లను అందజేశారు.