జనగణన పారదర్శకంగా పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:43 PM
నగరపాలక సంస్థ పరిధిలో త్వరలో చేపట్టనున్న జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఉద్యోగులకు సూచించారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో త్వరలో చేపట్టనున్న జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఉద్యోగులకు సూచించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు, జనగణన ఫీల్డ్ ట్రైనర్లతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని, ఎక్కడ జాప్యం జరుగకుండా చూడాలని, డేటా సేకరణలో ప్రతి ఇంటిని సందర్శించి కచ్చితమైన సమాచారాన్ని సేకరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జనగణన ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం తెలిపే విధంగా ప్రోత్సహించాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 666 హౌస్‌లిస్ట్ బ్లాక్‌ల ప్రకారం గుర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు, మూడు విడుతల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని ట్రైనర్లకు సూచించారు. గుర్తించిన 885 మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల బ్యాచ్‌ల వారీగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి జనగణన చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, టౌన్‌ప్లానింగ్ అధికారులు బషీరొద్దీన్, వేణు, శ్రీధర్, ఎంహెచ్‌వో సుమన్, జనగణన ట్రైనర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.