Share News

జన గణనను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:43 AM

జనాభా గణన 2026-27లో వేములవాడ నియోజకవర్గ ప్రజలు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు.

జన గణనను విజయవంతం చేయాలి

వేములవాడ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జనాభా గణన 2026-27లో వేములవాడ నియోజకవర్గ ప్రజలు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనాభా గణన కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2011 తర్వాత మళ్లీ 2026 సంవత్సరంలో జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఏప్రిల్‌ 26 నుంచి మే 10వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిం దన్నారు. అనంతరం మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటిం టికీ వెళ్లి ఇళ్ల గణన, కుటుంబ వివరాలను సేకరిస్తారని తెలిపారు. తదుపరి దశగా 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పూర్తిస్థాయిలో జనాభా గణనను నిర్వహించబడుతుందన్నారు. ఈ గణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని, ఇందులో వ్యక్తిగత వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, నివాస పరిస్థితులు, కుల వివరాలు వంటి అంశాలు ఉంటా యని వివరించారు. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ఆర్టీఐ చట్టం కింద కూడా ఈ వివరాలు వెల్లడిం చబడవని స్పష్టం చేశారు. ప్రతి 800 మంది జనాభాకు లేదా 250 ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించబడుతారని అన్నారు. నియోజకవర్గ అభి వృద్ధి, సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాల్లో ఈ గణాంకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. అదనంగా కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో పాటు 34వ ప్రశ్నగా బీసీల గణనను కూడా చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని, కేంద్రం కూడా బీసీల లెక్కలు సేకరిస్తే ఆ వర్గాల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సముచిత న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలందరూ జనాభా గణన కార్యక్రమంలో పాల్గొని ఎన్యూమరేటర్లకు సరైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

జన గణనపై ఉపాధ్యాయులకు అవగాహన

వేములవాడ పట్టణంలో చేపట్టనున్న జనాభా గణన కోసం మున్సిపల్‌ చైర్మన్‌ రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సును నిర్వహిం చారు. మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జనగణన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితన తర్వాత జరుగుతున్న మొదటి జన గణన అని, తొలి సారిగా డిజిటల్‌ విధాన్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో ప్రజల భాగస్వా మ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తర్వాత వచ్చే 11 అంకెల ఎస్‌ఈ ఐడీని భద్రపరచుకోవాలని, మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు దీనిని చూపించి ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ సంపత్‌కుమార్‌ కౌన్సిలర్లు తదిత రులు ఉన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:43 AM