జన గణనను పకడ్బందీగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:21 AM
జన గణన 2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : జన గణన 2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం జనగణన 2027 పై సెన్సెస్ ఫర్ వెల్ఫేర్ పేరిట బుధవారం నుంచి శుక్రవారం వరకు చార్జర్ అధికారులు, అదనపు చార్జర్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సెన్సె స్ చట్టం 1948 రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం జన గణన చేపడుతుందని తెలిపారు. చార్జర్ ఆఫీస ర్లుగా మున్సిపాలిటీలో కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లు, అదనపు చార్జర్ ఆఫీసర్లుగా ఎంపీడీ వోలు, మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారని వెల్లడించారు. ఎన్యూమరేషన్ బ్లాక్‌లో దాదాపు 700 నుంచి 800మంది ప్రజలు ఉంటారని తెలిపారు. ఎన్యూమరేటర్, సూపర్‌వైజర్లు గా ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. ఐదుగురు ఎన్యూ మరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌లను నియమించాలన్నారు. ప్రతి మండలా నికి ఒక టెక్నికల్ సహాయకులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొ న్నారు. రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణన అని వెల్లడించారు. ఈ విధానంలో ప్రజలు తమ వివరాలు పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే సదుపాయం ఉందని అన్నారు. జిల్లా ప్రధాన గణన అధికారిగా కలెక్టర్, జిల్లా అదనపు గణన అధికారిగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గణన అధికారిగా శ్రీనివాసాచారి ఉంటారని వివరిం చారు. మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నివా స గృహాల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరించాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం జన గణన అనేది చాలా కీలకమైన అంశమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేం దుకు జన గణన చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్య, అక్షరాస్యత, జనాభా, లింగ నిష్పత్తి, వలసలు, ఉపాధి నివాస స్థితి తదితర అంశాల వివరాలు జనగణనతో ప్రభుత్వం వద్ద ఉంటాయని వెల్లడించారు. దీంతో ప్రతి ప్రభుత్వ పనికి సంబంధించి ఈ వివరాలు కీలకమని స్పష్టం చేశారు. జన గణనలో పాల్గొని అధికారులు బాధ్యతాయుతంగా తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని సూచించారు. అధికారులు వివ రాలు పక్కాగా సేకరించి నమోదు చేయించాలని ఆదేశించారు. రోజువారీ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ నుంచి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ శ్రేయ, సుమిత్ర హాజరై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.