కల్యాణ వైభోగమే..
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:47 PM
జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర, లక్ష్మీనారాయణస్వామి కల్యాణాలను మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, జనవరి (ఆంధ్రజ్యోతి) 27: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర, లక్ష్మీనారాయణస్వామి కల్యాణాలను మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో కరీంనగర్ కాంగ్రేస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్‌రావు తిరుమల నుంచి తెప్పించిన లడ్డూలను భక్తులందరికీ వితరణ చేశారు. మంత్రి విజ్ఞప్తి మేరకు టీటీడీ నుంచి డిప్యూటీ ఈవో లోకనాథ్ సిబ్బందితో వచ్చి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అన్నప్రసాదవితరణ జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్నితిలకించారు. మంత్రి పొన్నం ప్రభాకర్-మంజుల దంపతులు, కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో కఫిసొ అధ్యక్షుడు, సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, నాయకులు కటకం వెంకటరమణ, పొన్నం సత్యం, డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నాయిని సుప్రియ, ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్, అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు, నాగరాజాచార్యులు పాల్గొన్నారు. సాయంత్రం గరుడ వాహనంపై ఆలయ మాడ వీధులలో శ్రీవారు విహరిస్తూ కనువిందు చేశారు.
ఫ బ్రహ్మోత్సవాల్లో నేడు...
బుధవారం ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, అన్నకూటోత్సవం, నిత్యహోమం, సింహవాహనసేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి సహస్రదీపాలంకరణ సేవ, హనుమత్‌వాహనసేవ, ఉదయం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.