Share News

నియంతృత్వ పాలన సాగిస్తున్న బీజేపీ

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:34 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నదని సీపీఐ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు.

నియంతృత్వ పాలన సాగిస్తున్న బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నదని సీపీఐ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నీట్‌ పేపర్‌ లీకేజీపై తీవ్ర ఆందోళన జరుగుతుంటే ప్రదాని మోదీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కార్పొరేట్‌ పెట్టుబడి దారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వారి సంక్షేమానికి కొమ్ము కాస్తున్నాడన్నారు. 12 సంవత్సరాల పాలనలో బీజేపీ ప్రభుత్వం పేదలకు చేసిందేమి లేదన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ అయినా దోషులను శిక్షించలేదన్నారు. కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదన్నారు. ఢిల్లీలో ఆందోళన కారులపై బాష్పవాయువు ప్రయోగించడం, లాఠి ఛార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాగెల్లిలక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:34 PM