Share News

నీట్‌ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన బీజేపీ ప్రభుత్వం

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:36 AM

దేశ వ్యాప్తంగా లక్షల మంది నీట్‌ విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం చెలగాటం ఆడిందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

నీట్‌ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన బీజేపీ ప్రభుత్వం

సిరిసిల్ల టౌన్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా లక్షల మంది నీట్‌ విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం చెలగాటం ఆడిందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువకుల ఆందోళనతో కేంద్ర విద్యాశాఖ మం త్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో అంబ్కేర్‌ చౌరస్తా నుంచి కొవ్వొత్తులతో గాంధీచౌక్‌వరకు నాయకులు విజయో త్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నీట్‌ పరీక్ష లీకేజీతో మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులు, లాఠీ చార్జీతో గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన విద్యార్థినీల ఆత్మకు శాంతి చేకూరాలంటూ మౌనం పాటిం చి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, గ్రంథాలయం జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు మాట్లాడారు. నీట్‌ పరీక్ష లీకేజీతో దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రతిపక్షాల ఆందోళనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడ లు వంచడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం విద్యార్థులు,యువత, ప్రతిపక్ష పార్టీల విజయం అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతోనే సరిపోదని దీని వెనకాల ఉన్నవారి పై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పరీక్ష లీకేజీతో ఆత్మహ త్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబా లకు, డిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమాలలో పోలీసుల లాఠీచార్జీతో గాయపడిన బాధిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను ప్రటించాలని విద్యార్థులపై పెట్టిన కేసులను కూడా వెం టనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ సుబేదే బేగం, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్‌, జిల్లా కార్యదర్శి చొక్కాల రాము, అలువాల చంద్రు, జిల్లా ఉపాధ్యక్షుడు దత్తా త్రేయ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర పధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ రియాజ్‌, కౌన్సిలర్‌ బొద్దుల శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ గౌడ్‌ రాజు, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ వైస్‌చైర్మన్‌ నీలీ రవీందర్‌, మార్కెట్‌ కమిటి మాజీ వైస్‌ చైర్మన్‌ బైరి ప్రభాకర్‌, వివిధ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, నాయ కులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:36 AM