వేదఘోషతో మార్మోగిన భీమేశ్వర ఆలయం
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:19 AM
వేములవాడ భీమేశ్వరస్వా మి ఆలయం గురువారం వేదఘోషతో మార్మోగింది.
వేములవాడ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వేములవాడ భీమేశ్వరస్వా మి ఆలయం గురువారం వేదఘోషతో మార్మోగింది. ప్రభుత్వం దేవాదా య శాఖ ఆధ్వర్యంలో ప్రధాన దేవాలయాల్లో నిర్వహించ తలపెట్టిన వరుణయాగం వేములవాడ భీమేశ్వర ఆలయంలో మంత్రులు ప్రారం భించారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ అర్చకులు రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేం ఏకాంతంగా నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం నుంచి ఆగ స్టు 1వ తేది వరకు నిర్వహించే వరుణయాగాన్ని పురస్కరించుకుని స్వామివారికి సత్వర సద్యఃసువృష్టి కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠను చేప ట్టారు. వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, స్వామి వారికి సంతత ధారాభిషేకం ఘనంగా నిర్వహించారు.
వరుణయాగంలో మొదటి రోజు పూజలు..
భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే వరుణయాగం సందర్భం గా అర్చకులు, వేద పండితులు పూజలను నిర్వహించారు. మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, ఋశ్య శృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, వరుణయాగ హోమాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో గావించారు. సంతత ధారాభిషేకం, జాపానుష్టానా లను శాస్ర్తోక్తంగా చేపట్టారు. అంతేకాకుండా అనుబంధ, పరివార ఆల యాల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమా లు నిర్వహించునున్నారు.
వర్షంలోనూ సాగిన మంత్రులు పర్యటన
వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వచ్చిన మంత్రుల పర్యటన భారీ వర్షంలోనూ కొనసాగింది. శ్రీరాజరాజే శ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమన్న ఆలయంలో నిర్వహించిన వరుణయాగం, గుడి చెరువుపై నిర్మించిన ట్యాంక్ బండ్ పార్క్ ప్రారం భోత్సవం, ఆర్టీసీ బస్టాండు ఆధునికీకరణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్ కుమార్‌లు వర్షంలోనే ముందుకు సాగారు. గుడి చెరువు ట్యాంక్ బండ్‌ను ప్రారంభించిన మం త్రులు కిలోమీటర్ వరకు పార్క్‌ను వీక్షిస్తూ కాలినడకన భారీ శివుడి విగ్రహం వద్దకు చేరుకున్నారు. గుడి చెరువులో ఏర్పాటు చేయనున్న బోటింగ్ కోసం గుడి చెరువు వ్యూను మంత్రులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివరించారు.