Share News

‘పది’లో ఉత్తమ ఫలితాలు అభినందనీయం

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:02 AM

పదోతరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా నాలుగో స్థానం సాధిం చడం అభినందనీయమని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నా రు.

‘పది’లో ఉత్తమ ఫలితాలు అభినందనీయం
కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న డీఈవో రాము

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పదోతరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా నాలుగో స్థానం సాధిం చడం అభినందనీయమని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయిన సందర్భంగా డీఈవో రాము, ఇతర విద్యాశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడారు. జిల్లాలో మార్చి 13వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జగిత్యాల జిల్లా అద్భుత ఫలితాలతో 98.87 శాతంతో రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచిం దన్నారు. గత యేడాది సైతం రాష్ట్రంలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని, ఇప్పుడు సైతం అదే స్థానాన్ని నిలుపుకోవడం జరిగిందన్నారు. విజయానికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రాము, వివిధ మండలాల విద్యాధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యా ర్థులు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జిల్లా విద్యాధికారి రాము, పలువురు ఎంఈవోలు, జిల్లా కో ఆర్డినేటర్లు, విద్యాశాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 01:02 AM