Share News

సభ్యుల సమష్టితోనే సంఘం అభివృద్ధి

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:30 AM

సభ్యుల సమష్టితోనే సంఘం అభివృద్ధి చెందుతుందని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు రాఘవరావు అన్నారు.

సభ్యుల సమష్టితోనే సంఘం అభివృద్ధి
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు రాఘవరావు

హుజూరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సభ్యుల సమష్టితోనే సంఘం అభివృద్ధి చెందుతుందని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు రాఘవరావు అన్నారు. హుజూరాబాద్‌ చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం 73వ వార్షిక, 86వ మహాసభ అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్‌ అధ్యక్షతన సంఘం కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ నూతన డిజైన్లతో నాణ్యత కలిగిన ఉత్పత్తులు చేయాలన్నారు. పథకాల అమలుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. నేతన్న భరోసా పథకం, డబ్బు పెంపు, గుర్తింపు కార్డులకు సంఘాల అధ్యక్షులందరూ కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలన్నారు. సంఘం అభివృద్ధి పథంలో కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం సంఘ వార్షిక నివేదిక, బడ్జెట్‌, ఖర్చులు, ఆదాయ, వ్యయ బడ్జెట్‌ను సంఘం మేనేజర్‌ మంచికట్ల కోటిలింగం చదివి వినిపించారు. కార్యక్రమంలో చేనేత అభివృద్ధి అధికారి అజార్‌వహబ్‌, అప్కో మాజీ డైరెక్టర్‌ సత్యనారాయణ, చేనేత సంఘాల అధ్యక్షుడు మునిందర్‌, పద్మ-రమేష్‌, ఉడుత రమేష్‌, భద్రయ్య, సదానందం, వేముల యాదగిరి, తిరుపతి, మహదేవ్‌, సమ్మరాజు, తిరుపతి, కమలాకర్‌, సదానందం, రాజమణి, తిరుపతమ్మ పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:30 AM