Share News

సమీపిస్తున్న ’సర్‌‘ గడువు..

ABN , Publish Date - Jul 11 , 2026 | 01:11 AM

ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రి యకు గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 24వ తేదీలోగా డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండటంతో కలెక్టర్‌ రం గంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్‌ను వేగ వంతం చేసేందుకు బీఎల్‌ఓలతో పాటు మున్సిపల్‌, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బందిని పురమాయిస్తున్నారు.

సమీపిస్తున్న ’సర్‌‘ గడువు..
పెద్దపల్లి పట్టణంలో బీఎల్‌వోలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- డిజిటలైజేషన్‌కు ఈ నెల 24 వరకు గడువు

- జిల్లాలో 30.24 శాతమే డిజిటలైజేషన్‌

- రంగంలోకి దిగిన కలెక్టర్‌

- పంచాయతీలు మున్సిపాలిటీలో హెల్ప్‌డెస్క్‌లు

- భాగస్వాములు కావాలని ఇతర సిబ్బందికి ఆదేశాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రి యకు గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 24వ తేదీలోగా డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండటంతో కలెక్టర్‌ రం గంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్‌ను వేగ వంతం చేసేందుకు బీఎల్‌ఓలతో పాటు మున్సిపల్‌, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బందిని పురమాయిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 30.29 శాతం డిజిటలైజేషన్‌ మాత్రమే పూర్తవడంతో మిగిలిన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 18వ తేదీ వరకు 80 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను శనివారం నుంచి ఏర్పాటు చేసి ప్రజ లకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు ఫారాలు నింపడం, వివరాల నమోదు, అవసరమైన పత్రాల పరిశీలన అంశాల్లో సహాయం అందించాలన్నారు. బూత్‌ లెవెల్‌ అధికారు లతో ఈ ప్రక్రియ గడువులోపు పూర్తయ్యే పరిస్థితి లేక పోవడంతో కార్యదర్శులు, కారోబార్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతిని ధులు, పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, విద్యావంతుల భాగస్వాములను చేయా లని మున్సిపల్‌, పంచాయతీ అధికారులను ఆదేశిం చారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌లో భాగంగా 2002 నాటి ఓటర్ల జాబితాలను ప్రామాణికంగా తీసుకుని డబుల్‌ ఓటర్లు, అనర్హులు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపుతోపాటు 18 ఏళ్లు నిండిన అర్హులైన కొత్త ఓటర్ల నమోదు చేపడుతున్నారు. ప్రతీ కుటుంబం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారిని మాత్రమే ఓటర్ల జాబితాలో కొనసాగించేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.

ఫ రోజువారీగా సమీక్ష చేయాలి..

గడువు ఇక 13 రోజులే ఉండటంతో ప్రతీ మండలంలో పురోగతిని రోజువారీగా సమీక్షించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వెనుకబడిన ప్రాం తాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యానికి అను గుణంగా రోజు డిజిటలైజేషన్‌ శాతం పెరిగేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. సర్‌ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం కీలకమని కలెక్టర్‌ సూచిస్తున్నారు. బీఎల్‌వోలు ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన వివ రాలు, పత్రాలు అందించే విధంగా, ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులు, కార్యదర్శులను ఆదేశించారు.

ఫ రామగుండం నియోజకవర్గంలో అత్యధికం..

సర్‌లో భాగంగా రామగుండం నియోజకవర్గంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,990 మంది ఓటర్లు ఉండగా, 76,529 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజే షన్‌ చేశారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిఽధిలో 35.76 శాతం, అంతర్గాం మండలంలో 42.04 శాతం, పాలకుర్తి మండలంలో 42.65 శాతం, మొత్తం 35.76 శాతం పూర్తి చేసి ముందు వరసలో ఉన్నారు.

ఫ మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో 2,38,765 మంది ఓటర్లు ఉండగా, 65,886 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్‌ చేశారు. మంథని మండలంలో 20.62 శాతం, కమాన్‌పూర్‌ మండలంలో 15.29 శాతం, ముత్తా రం మండలంలో 38.29 శాతం, రామగిరి మండలంలో 24.45 శాతం, పలిమెల మండలంలో 25.05 శాతం, కాటారం మండలంలో 38.46 శాతం, మహదేవ్‌పూర్‌ మండలంలో 28.34 శాతం, మహాముత్తారం మండ లంలో 34.52 శాతం, మల్హర్‌రావు మండలంలో 22.84 శాతం, పాలకుర్తి మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో 37.31 శాతం పూర్తి చేశారు. మొత్తం 27.59 శాతమే పూర్తయ్యింది.

ఫ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,59,402 మంది ఓటర్లు ఉండగా 72,916 మంది ఓటర్ల వివరా లను డిజిటలైజేషన్‌ పూర్తి చేశారు. పెద్దపల్లి మండలం లో 22.03 శాతం, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 32.21 శాతం, ఓదెల మండలంలో 32.95 శాతం, సుల్తానాబాద్‌ మండలంలో 25.44 శాతం, ఎలిగేడు మండలంలో 40.72 శాతం, జూలపల్లి మండలంలో 36.24 శాతం, మొత్తం 28.11 శాతం ఓటర్ల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది.

ఫ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్‌ పురోగతి..

-----------

క్ర.సం. నియోజకవర్గం పీఎస్‌లు మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్‌ శాతం

-----------------------------------------------------------------------------------------------------------------------------

1. రామగుండం 262 213990 76529 35.76

2. మంథని 292 238765 65886 27.59

3. పెద్దపల్లి 291 259402 72916 28.11

-----------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 845 712157 215331 30.24

-----------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Jul 11 , 2026 | 01:11 AM