సాగులో రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యం
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:07 AM
వ్యవసాయ సాగులో రైతు లకు భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చొప్ప దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ సాగులో రైతు లకు భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చొప్ప దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా సబ్సిడీపై రైతులకు వివిధ రకాల పనిముట్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రానున్న వేసవిలో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్‌చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, పలు గ్రామాల సర్పంచులు భీమ్‌రెడ్డి మహేశ్వ ర్‌రెడ్డి, ఏనుగుల కనకయ్య, సుద్దాల మధు, నల్ల మోహన్, మం డల కాంగ్రెస్ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డిరెడ్డి, నాయకులు సంభ లక్ష్మిరాజం, నాగుల వంశీ సువిన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.