హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:11 AM
సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం హత్యలో పాత్రధారులు, సూత్రధారులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం హత్యలో పాత్రధారులు, సూత్రధారులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం అంబే ద్కర్ చౌరస్తాలో వెంగళ వెంకటేశం హత్యకు పాల్పడిన నిందితులను శిక్షిం చాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడినట్టు సృష్టించి బీఆర్‌ఎస్ పార్టీపై నెట్టాలనే దురుద్దేశంతో హత్యకు పూనుకోవడం దురదృష్టకరమన్నారు. ఏదైనా ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని హత్యారాజకీయాలకు పాల్పడడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల పట్ల కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతుండడం ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. జిల్లా పోలీసులపై తమకు నమ్మకం ఉందని వెంగళ వెంకటేశం హత్య వెనకాల ఉన్న పాత్రధారులు, సూత్రధారులపై పూర్తి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, పట్టణ కార్యదర్శి మ్యాన రవి, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సి లర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.