Share News

టీజీ ఎండీసీ చెక్‌ పోస్టు తనిఖీ

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:14 AM

మానకొండూర్‌ మండలంలోని పచ్చునూర్‌ గ్రామంలోని టీజీ ఎండీసీ (తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఇంటిగ్రేటడ్‌ చెక్‌ పోస్టును కలెక్టర్‌ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ ఆలం సోమవారం తనిఖీ చేశారు. చెక్‌పోస్టులోని రికార్డులు, సీసీ టీవీ పరిశీలించారు.

టీజీ ఎండీసీ చెక్‌ పోస్టు తనిఖీ

మానకొండూర్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మానకొండూర్‌ మండలంలోని పచ్చునూర్‌ గ్రామంలోని టీజీ ఎండీసీ (తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఇంటిగ్రేటడ్‌ చెక్‌ పోస్టును కలెక్టర్‌ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ ఆలం సోమవారం తనిఖీ చేశారు. చెక్‌పోస్టులోని రికార్డులు, సీసీ టీవీ పరిశీలించారు. మానేరు వాగు నుంచి ఇసుక లోడ్‌తో వెళుతున్న లారీలను ఆపి వే బిల్లులను చూశారు. చెక్‌ పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రతీ లారీని ఆపి ఇసుక లోడ్‌, వే బిల్లులను పరిశీలించిన తర్వాతనే పంపించాలని సూచించారు. వారి వెంట సీఐ సంజీవ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఫ వీణవంక: మండలంలో చల్లూరుఇసుక క్వారీ వేయింగ్‌ బ్రిడ్జి పని తీరును కలెక్టర్‌ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ఆలం పరిశీలించారు. క్వారీ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వే బిల్లులు, డీడీలు రికార్డులు పరిశీలించారు. ఇసుక రవాణా చేసే ప్రతీ లారీ ఎంట్రీ ఎగ్జీట్‌ వివరాలను సాండ్‌ అడిట్‌ యాప్‌లో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. రికార్డుల్లో ఎలాంటి తేడాలు ఉన్నా ఉపేక్షంచేది లేదని హెచ్చరించారు. .ఇసుకను తరలించే సమయంలో లారీల డ్రైవర్లు తప్పని సరిగా టార్పాలిన్లు కప్పాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌, హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి, తహసీల్దార్‌ అనుపమరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:14 AM