ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 15 , 2026 | 01:04 AM
జిల్లాలో తొలిరోజు సోమవారం తెలుగు పేపర్-1 పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
పలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్
జగిత్యాల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలిరోజు సోమవారం తెలుగు పేపర్-1 పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 68 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో 12,684 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 12,673 మంది విద్యార్థులు హాజరయ్యారు. 11మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకటి ప్రైవేటు పరీక్ష కేంద్రంలో 12 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 12మంది హాజరు అయ్యారు. అద నపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, ఇతర అధికా రులు జగిత్యాలలోని పురాణిపేట పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, పలు ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. కాగా అదనపు కలెక్టర్ బీఎస్ లత రెండు కేంద్రాలను, జిల్లా విద్యాధికారి రాము పలు ప్రాంతాల్లో గల ఆరు కేంద్రాలను, స్టేట్ అబ్జర్వర్స్ బృందం ఏడు కేంద్రాలను, జిల్లా పరీక్షల సహాయ పరిశీలనా ధికారి మూడు కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ 20కేంద్రాలను సందర్శించి పర్యవేక్షణ జరిపారు.