ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్రం
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:25 AM
కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని ప్రజల భాగస్వామ్యం ఉండటం ద్వారానే సాధ్యపడిం దని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని ప్రజల భాగస్వామ్యం ఉండటం ద్వారానే సాధ్యపడిం దని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పేర్కొన్నారు. మండలకేం ద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ నాయకులం అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకరావడం వల్లనే సాధ్యమైంద న్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమాల్లో పాల్గొన్న తమపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. దీక్షా దివస్నను పార్టీపరంగా నిర్వహించుకుంటే తప్పులేదని, కానీ దీక్షాదివస్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిం దనడం సరైనది కాదన్నారు. నాటి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌ను స్థంబింపజే శారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్దకు కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి పార్టీని విలీనం చేస్తానని చెప్పింది వాస్తవంకాదా అని ప్రశ్నిం చారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాలన్నారు. సమావేశం లో కాంగ్రెస్ నాయకులు అంతగిరి వినయ్‌కుమార్, పసుల వెంకటి, ఒగ్గు రమేష్, యాస తిరుపతి, ఎర్రోజు సంతోష్‌కుమార్, గుండ్రెడ్డి రాజు పాల్గొన్నారు.