సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ ఆదర్శం
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:31 AM
దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శనంగా నిలు స్తోందని, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శనంగా నిలు స్తోందని, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన-ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 11, 24 వార్డుల పరిధిలో వార్డు సభ లు, రూరల్ మండలం మల్లారం గ్రామంలో గ్రామ సభ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు సభలో వర్షాకాల ముందస్తు చర్యలు, జల సంరక్షణ, వనమహోత్సవం, సురక్షిత తాగునీరు, వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళ సంరక్షణ, వర్షాకాల సన్నద్ధత, పంటల మార్పిడి, ఓటరు జాబిత ప్రత్యేక సమగ్ర సవరణ, పారిశుధ్యం తదితర అంశాలపై గ్రామ ప్రజలతో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కల్పించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై, కేరళలో సీఎం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మొదటి సంతకం చేశారని వివరించారు. రాష్ట్రంలో కుల గణన చేసిన తర్వాత నరేంద్ర మోదీ దిగి వచ్చి దేశంలో జనగణ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు విషయంలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఇందిర మ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. పంటలు సాగు చేసే ముందు వ్యవసాయ అధికారులను సంప్రదించి, ప్రణాళిక ప్రకా రం ముందుకు వెళ్తే ఇబ్బందులు ఉండవని వివరించారు. ఆయిల్ పామ్, సన్నవడ్లు, కూరగాయాలు, పప్పు ధాన్యాలు తదితర లాభదా యక పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలిన సూచించారు. అయిల్‌పామ్‌కు సంబంధించి సిద్దిపేట జిల్లా నర్మెటలో పరిశ్రమ ఉందని, పండించిన దిగుబడిని పరిశ్రమకు తీసుకువెళ్లడానికి దూర భారం కూడా లేదని గుర్తు చేశారు. పంట మార్పిడి చేయకపోతే నేలసారం తగ్గుతుందనే విషయాన్ని రైతులు గమనించాలని సూచిం చారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతం గా అమలు చేయాలని అన్నారు. జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. మహిళల భద్రత, రోడ్డు భద్రత అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. వర్షాకాలనికి ముందే గ్రామాల్లోని డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బహి రంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని కోరారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు రూ.150 కోటతో కొనసాగుతున్నా యని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మరో వెయ్యి సంవత్సరాల పాటు ఆలయం ఉండేలా తీర్చిదిద్దు తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఊపందు కున్నాయని, దేశానికి రోల్ మోడల్ ఇందిరమ్మ పథకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఆత్మకమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, ఆర్డీవో కే.ఎస్.బి కుమారి, కమిషనర్ లోకేష్, డీఎస్పీ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజం, మల్లా రం సర్పంచ్ అర్పితరెడ్డి, కౌన్సిలర్లు రామతీర్థపు కృష్ణవేణి, అన్నారం శ్రీనివాస్, వెంగల అనిత, కొక్కుల బాలకృష్ణయ్య, కొండ రాజశేఖర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, పీర్‌మహ్మద్ తదిత రులు ఉన్నారు.