ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:03 AM
సంక్షేమం అభివృద్ధి విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్ర భుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, జూలై 3(ఆంధ్రజ్యోతి) : సంక్షేమం అభివృద్ధి విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్ర భుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలంలోని తుర్కాష్‌నగర్ మాజీ సర్పంచ్ బీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ హుస్సేన్, బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు స య్యద్ మోహీనుద్దీన్‌తోపాటు దాదాపు 20మంది బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతు న్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు అనూహ్యంగా పెరుగుతూ వస్తుందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మహిళలు, యువత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నా రన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజల ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి హైదరాబాద్ మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. కార్యకర్తలు నాయకులు ప్రభు త్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మెన్ రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సామ తిరుపతి రెడ్డి, నాయకులు రంగు వెంకటేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.